YouTube నుంచి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా?
కానీ ఎలా అనేది మీకు తెలియడం లేదా అయితే ఈ Post మీకోసమే..
YouTube అనేది Entertainment గానే కాకుండా ఈ మధ్య అందరికీ కూడా Revenue Earning Platform గా మారిపోయింది..
YouTube Channel ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే మనకి ఒక passion అంటూ ఉండాలి వాళ్లు చేస్తున్నారు వీళ్లు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో start చేయకుండా మనకి ఏమి టాలెంట్ ఉన్నది ఏది బాగా చేయగలము అన్నది ఆలోచించుకుని content select చేసుకుని అప్పుడు Channel start చేయండి..
ఏ మాత్రం Talent ఉన్నా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు..
అయితే దాని కోసం మీరు కొంత Information తెలుసుకోవాల్సి ఉంటుంది.. ఇలా కొత్తగా YouTube Channel Create చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడే Information అంతా కూడా నా YouTube Channel లో పొందు పరిచాను..
Channel Create చేయడం దగ్గర నుంచి
- Thumbnails Create చేయడం,
- Video Edit చేయడం,
- Video ని YouTube లో కి ఎలా Upload చేయాలి,
- అలాగే Phone లో ఎలా Upload చేయాలి,
- PC లో ఎలా Upload చేయాలి
అనే వాటి గురించి కూడా Clear గా Explain చేశాను..
అలాగే YouTube Channel Start చేసిన తర్వాత వచ్చే ప్రతి ఒక్క Doubt కూడా మీకు Clarify అయ్యేలాగా Videos అయితే చేశాను.
YouTube నుంచి డబ్బులు సంపాదించాలి అని అనుకుని మీరు videos చేసే ముందుగా అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ own camera/phone తో మీ own గా shoot చేసిన videos మాత్రమే upload చేయాల్సి ఉంటుంది.. వేరే వాళ్ళ videos తీసుకుని upload చేసినా కూడా మీరు money earn చేయలేరు YouTube నుంచి..
YouTube లో ఒక నెలకి లక్షల్లో సంపాదించే వాళ్లు కూడా ఉన్నారు.. అది ఏది అయినా కూడా మీరు select చేసుకునే content ను బట్టి ఉంటుంది మీరు ఎందులో అయితే బాగా explain చేయగలరో ఆ topic select చేసుకుని మీరు video చేయడం వలన త్వరగా success అవ్వొచ్చు..
YouTube కి సంభందించినవి ఏవి అయినా కూడా ఇలా theoretical గా కంటే practical గా చూపిస్తేనే అర్ధం అవుతుంది.. so తెలుసుకోండి ఈ post చూసి YouTube గురించి అంతా..
ఇక ఇప్పుడు మనం ఈ blog లో అసలు YouTube channel create చేయడం దగ్గర్నుంచి మొత్తం తెలుసుకుందాము.. Channel create చేసిన వాళ్లకి ఎలాంటి doubts వస్తాయో అవన్నీ కూడా clear గా నేను ఇక్కడ explain చేస్తాను..
మీకు ఎక్కడా దొరకని information నేను ఇస్తాను ఈ blog లో ప్రతి ఒక్కటి కూడా clear గా చూడండి mostly మీ doubts అన్ని కూడా clarify అయిపోతాయి..
YouTube నుంచి డబ్బులు రావాలంటే ముందు Channel Review చేస్తారు దానికి కొన్ని Requirements ఉంటాయి. Long Videos కి అయితే Last 12 Months లో 4000 hours complete అవ్వాలి. అదే Shorts కి అయితే Last 3 Months లో 10M Views రావాలి.. ఆ details తెలుసుకోండి ఈ video లో.
ముందుగా channel కి logo ఎలా create చేయాలో తెలుసుకోటానికి ఈ video చూడండి..
YouTube Channel ఎలా Create చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ క్రింది Video చూడండి.
Long Video కి ఒక పద్దతి, Short Video కి ఒక పద్ధతి ఉంటుంది Video Shoot చేయటానికి.
ఇప్పుడు Video Editing Inshot App లో ఎలా Edit చేయాలో ఈ Video చూసి తెలుసుకోండి.
ప్రత్యేకం గా Shorts Shooting Editing ఇలా చేయండి
Upload చేసే ప్రతి Video కి Description, Tags ఇవ్వనవసరం లేకుండా ఇలా Upload చేయండి
Video Upload కూడా అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు మనం చేయాల్సిన పని దానికి Thumbnail Set చేసుకోవడం.
ఇక Thumbnail Set చేసుకోవడానికి ఒక చిన్న చిక్కు ఉంది కొత్త YouTubers కి అది ఏంటంటే మనం Channel Verify చేసుకోకుండా మనకి కావలసిన Thumbnail పెట్టుకోలేము YouTube వాళ్ళు ఒక 3 Pics ఇస్తారు మన Upload చేసిన Video లో నుంచి.. అవి పెట్టుకోవచ్చు కానీ మనం క్రియేట్ చేసిన Thumbnail పెట్టుకోవాలి అంటే Channel Verification అయిన తరువాత మాత్రమే మనం ఆ Thumbnail Set చేసుకోగలము.. ఆ Verification Process ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం కోసం ఈ క్రింది Video చూడండి..
ఈ Verification Process వల్ల మనం 15 నిమిషాల కంటే పైన ఉన్న వీడియోని కూడా Upload చేసుకోవడానికి YouTube అనుమతిస్తుంది..
Thumbnail Verification కూడా అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు మనం Thumbnail ఎలా Create చెయ్యాలో తెలుసుకోవాలి.
దానికోసం మనకి చాలా రకాల Apps ఉంటాయి Thumbnail Create చేసుకోవడానికి.. నేను ఏమి Apps Use చేస్తాను Thumbnail Create చేయడానికి అలాగే Pixellab లో Thumbnail ఎలా చేసుకోవాలో ఈ Videos చూసి తెలుసుకోండి..
Thumbnail అనేది చాలా Important Video కి Views రావటానికి.
ఇక ఈ Thumbnail Upload చేయడానికి మనకి ఒక App అవసరం అవుతుంది. అదే YT Studio App. ఈ App సహాయంతో మన Channel ని మనం Phone నుంచి Maintain చేస్తూ ఉండొచ్చు..
Shorts లో Thumbnail పెట్టటానికి ఇలా చేయండి
Video Upload అయిపోయింది అలాగే Thumbnail కూడా Upload చేసుకున్నాము ఇక views ఎలా వస్తున్నాయి అని తెలుసుకోవడానికి మన Analytics లో చూసుకుంటే సరిపోతుంది..
ఆ Analytics చూసుకోవడం అనేది YT Studio App లో చూసుకోవచ్చు అలాగే Chrome లో Phone లోనే Desktop Site లో కూడా చూసుకోవచ్చు లేదంటే PC లో చూసుకోవచ్చు.. ఆ Analytics బట్టి మన Channel ఎలా Perform చేస్తుంది అనేది కూడా మనకి ఒక Idea వస్తుంది.
ఆ Analytics ఎలా చూసుకోవాలి అనే దాని కోసం ఈ క్రింది రెండు వీడియోలు చూడండి..
ఇక views విషయంలో tips విషయానికి వస్తే గనక మీరు every video కి కూడా end screens అట్లాగే icards పెట్టుకోవచ్చు. మీరు మొదటి వీడియో కి పెట్టుకో లేకపోవచ్చు, ఒక 4 videos అయిన తరువాత ముందు ఉన్న videos ని మనం icards లో అలాగే end screens లో పెట్టుకోవచ్చు.. వీటి నుంచి కూడా మీకు views వచ్చే అవకాశం ఉంటుంది. ఈ end screens, icards ఎలా పెట్టాలో తెలుసుకోవడానికి క్రింది video చూడండి..
మనకి YouTube నుంచి Money రావాలి అంటే ముందుగా YouTube Rules ప్రకారం మన ఛానల్ కి 1000 మంది Subscribers అలాగే 4000 hrs వచ్చి ఉండాలి Last 12monthsలో.. ఇది ఎలా Count చేస్తారు అనే దాని గురించి చాలామందికి చాలా Doubts వస్తూ ఉంటాయి దాని కోసం ఆ Hrs అనేవి ఎలా Calculate చేస్తారు అనే దాని కోసం ఈ క్రింది Video చూడండి..
ఎప్పుడైతే మనకి 1000 subscribers 4000 hrs వస్తాయో అప్పుడు మన Channel, Review కి వెళ్లడం అనేది జరుగుతుంది..
దానికంటే ముందు adsense account అని ఒక Account Create చేసుకోవాల్సి ఉంటుంది అది అంతా కూడా YouTube Guide చేస్తుంది ఎలా create చేయాలి అని చాలా simple గా 4 steps లో create చేసుకోవచ్చు.. అలా ఆ account create చేసుకుని Channel ని review కోసం పంపిస్తాము..
ఈ review process అనేది manual గా జరిగే process. YouTube వాళ్లు మన channel ని చూస్తారు own content పెడుతున్నారా లేదా, వేరే videos copy చేసి post చేస్తున్నారా అనేది వాళ్లు manual గా review చేసి channel ని Monetize చేస్తారు..
ఈ monetization process అయిన తరువాత మనం ads అనేవి enable చేసుకోవాలి మన videos అన్నిటికీ. అన్ని ads enable చేసుకున్న తరువాత అదే రోజు గాని లేదా next రోజు నుంచి మనకి ads రావడం అనేది start అవుతుంది videos పైన..
మనకి ఎప్పుడైతే $10 వస్తాయో అప్పుడు మనం adsense account ని verify చేసుకోవాల్సి ఉంటుంది youtube మనకి ఒక mail పంపిస్తుంది. ఆ verify చేసుకోవడానికి మనం pancard/ driving license/passport/voter id గాని ఇలాంటివి upload చేయాల్సి ఉంటుంది..
అది verify అయిపోయిన తరువాత మన Address కి verification అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ address verification కోసం మనకి మన address కి ఒక pin number పంపిస్తారు YouTube వాళ్ళు.. ఆ pin ని మనం ఎప్పుడైతే adsense account లో enter చేస్తామో అప్పుడు మన adsense account verify అయినట్టు..
ఈ process అయిన తరువాత మనం payment details enter చేసుకోవచ్చు adsense account లో
ఇక మనకి ఎప్పుడైతే $100 వస్తాయో adsense account లో అప్పుడు మన bank account కి పంపించడం జరుగుతుంది..
ఇంత process ఉంటుంది youtube నుంచి money రావాలి అంటే. ఇంత ఉంది కాబట్టి ఇదేదో కష్టమైన process అని భయపడాల్సిన పనిలేదు. మీరు channel అంటూ start చేసి videos post చేయటం start చేస్తే మీకే అర్థమవుతుంది..
అసలు ads ఎలా play అవుతాయి ఎలాంటి ads వస్తే ఎంత revenue వస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింది video చూడండి..
అలాగే only normal videos ద్వారానే కాకుండా YouTube Shorts ద్వారా కూడా Money సంపాదించవచ్చు.. Shorts ఎలా record చేయాలి అలాగే ఎలా edit చేయాలి ఎలా upload చేయాలి అనేవి తెలుసుకోటానికి ఈ video చూడండి.
Shorts లో వాడే music ఎలా use చేయాలి అనేదాని గురించి తెలుసుకోటానికి ఈ video చూడండి..
shorts లో వచ్చే watchtime రావాల్సిన 4000hrs లో కలుస్తుంది.. అది కొన్ని చోట్ల వచ్చే views కి మాత్రమే. వాటి గురించి తెలుసుకోటానికి ఈ video చూడండి..
నా YouTube Channel (Madhuri Tech World) లో YouTube related playlist అని ఒక playlist ఉంటుంది అందులో ఇంకా చాలా చాలా information ఉంటుంది each & every చిన్న doubt కూడా clarify అవుతుంది ఆ videos చూస్తే..
ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా doubts ఉన్నా కూడా నాకు ఇక్కడ comments లో comment చేయండి..
ఈ information చాలా use అవుతుంది కొత్తగా channel create చేయాలి అనుకునే వాళ్ళకి so ఇంకా ఎవరికైనా share చేయాలి అన్నా కూడా ఇక్కడ ఉన్న ఈ social media buttons click చేసి share చేయొచ్చు..
ఈ information అంతా మీకు ఎలా అనిపించింది అనేది ఇక్కడ కింద comments లో comment చేసి నాకు తెలియజేయగలరు..